భారీగా ఆయుధాలు, హెరాయిన్, నగదు పట్టివేత

భారీగా ఆయుధాలు, హెరాయిన్, నగదు పట్టివేత
Heavy seizure of weapons heroin cash

జమ్మూకశ్మీర్: నార్కో టెర్రర్ మాడ్యూల్‌పై భద్రతా బలగాలు విరచుకుపడ్డాయి. అక్రమంగా మాదకద్రవ్యాలు, ఆయుధాలు సరఫరా చేస్తున్న స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేశాయి.  పూంచ్ జిల్లాలో భద్రతా బలగాల చేపుట్టిన గాలింపు చర్యల్లో ఈ నార్కో టెర్రర్ మాడ్యూల్ బయటపడింది. నటోరియస్ డ్రగ్ స్మగ్లర్‌గా పేరున్న రఫి ధన అలియాస్ రఫి లాలా అనే వ్యక్తిని ప్రజా భద్రతా చట్టం కింద అరెస్టు చేసి, అతని ఇంటి నుంచి 7 కిలోల హెరాయిన్, రూ.2 కోట్ల నగదు, ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పూంచ్‌లోని లైన్ ఆఫ్ కంట్రోల్ కు సమీపంలో రఫి ధన నివసిస్తున్నట్టు చెప్పారు.

''ఈరోజు మాకు అందిన సమాచారంతో ఇన్​స్పెక్టర్​ సునీల్ సారథ్యంలోని పూంచ్ టీమ్, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా రఫి ఇంటిలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దాడుల్లో 7 కిలోల హెరాయిన్, రూ.2 కోట్ల నగదు, ఒక పిస్టోల్, ఒక మ్యాగజైన్, ఏడు రౌండ్ల ఎస్ఎల్‌ఆర్ సహా 10 రౌండ్లు స్వాధీనం చేసుకున్నాం. మెజిస్ట్రేట్, పలువురు స్థానిక ప్రముఖుల సమక్షంలో సోదాలు కొనసాగుతున్నాయి'' అని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. పట్టుబడిన టెర్రర్ మాడ్యూల్‌కు, పంజాబ్‌కు చెందిన నార్కోటిక్స్ స్మగ్లర్లకు ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నామని, మండి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశామని చెప్పారు.