కుమారుడు ఓటమి

కుమారుడు ఓటమి

జేడీఎస్​ కంచుకోటను ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్​

కర్ణాటకలో జేడీఎస్ కు బిగ్ షాక్ తగిలింది. జేడీఎస్ అధినేత హెచ్‌డి  కుమారస్వామి కుమారుడు, హీరో నిఖిల్ ఓడిపోయారు. రామనగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ చేతిలో 13,459 ఓట్లతో ఓడిపోయారు. కుమారస్వామి కుటుంబానికి కంచుకోట అయిన రామనగర అసెంబ్లీ సీటును కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. కుమార‌స్వామి భార్య రామ‌న‌గ‌ర నుంచి టికెట్ ను త్యాగం చేసి నిఖిల్ కుమార‌గౌడ కు అవ‌కాశం ఇచ్చారు. అయినప్పటికీ జేడీఎస్ తన కంచుకోటను కాపాడుకోలేకపోయింది.  

గాలి జనార్ధన్​ రెడ్డి గెలుపు
కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ స్థాపించి పోటీ చేసిన గాలి జనార్దన్​రెడ్డి తన ప్రత్యర్థులపై 2 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 15 మంది అభ్యర్థులు గంగావతి నుంచి పోటీ చేయగా గాలి గెలుపొందారు.