కవిత‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించను- : బీజేపీ ఎంపీ అర్వింద్​

కవిత‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించను- : బీజేపీ ఎంపీ అర్వింద్​

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. బండి సంజయ్ కవితకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో బీజేపీకి చెందిన ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ ఇష్యూపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ తీరుని తప్పు పట్టేలా ఆయన మాట్లాడారు.  కవిత‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించను అని ఎంపీ అరవింద్ తేల్చి చెప్పారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదన్నారు. ఆయన వ్యాఖ్యలకు ఆయనే సంజయ్ వాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్న ఎంపీ అరవింద్.. ఆయనే సంజాయిషీ ఇచ్చుకుంటారని చెప్పారు.

కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన కామెంట్స్.. వాళ్లకు ఓ ఆయుధంలా మారాయన్నారు ఎంపీ అరవింద్. సామెతలను ఉపయోగించే సమయంలో జాగ్రతగా ఉండాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా పవర్ సెంటర్ కాదు, అందరినీ సమన్వయం చేసే బాధ్యత అది అని అరవింద్ అన్నారు.  కవిత ఈడీ ఆఫీసులో ఉంటే, తెలంగాణ క్యాబినెట్ అంతా ఢిల్లీలో మకాం వేసిందని ఎంపీ అరవింద్ విమర్శించారు. ఇదే చిత్తశుద్ది ప్రజల అభివృద్ధిపై ఉంటే రాష్ట్రం బాగుపడేదన్నారు. దర్యాప్తునకు కవిత సహకరించలేదని తెలిసిందన్నారు.

ఎందుకు? ఏమిటి? ఎలా? అని ఈడీ అధికారులు అడిగితే.. ఏమో, తెలవదు, గుర్తులేదు అని కవిత సమాధానం చెప్పినట్టు తెలిసిందన్నారు. కవిత చేతికి రూ.20లక్షల గడియారం, కోట్ల రూపాయల నగలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు తెలుసు అన్నారు అరవింద్. అవినీతిని అంతం చేయాలని ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని ఆయన చెప్పారు.  ‘‘కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో మునిగితేలారు. మీ వల్లే జెంటిల్మెన్ మాగుంట ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడింది. పెద్ద సంస్థ అరబిందో సైతం ఇబ్బందుల్లో ఉంది. రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబం అంటరాని కుటుంబం” అని ఎంపీ అరవింద్ అన్నారు.