బిజెపికి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతాడు

బిజెపికి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతాడు

రాహుల్ ను పీఎం చేయాలని చూస్తున్న కేసీఆర్

4 శాతం ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం

సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్ షా

ముద్ర, జమ్మికుంట: జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో ఈటెల రాజేందర్ కు మద్దతుగా సకల జనుల విజయసంకల్ప సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టిఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేస్తే కెసిఆర్ సీఎం అవుతాడు బిజెపికి ఓటు వేస్తే బీసీ సీఎం అవుతాడు. హూజురాబాద్ నియోజకవర్గము నుండి ఈటల రాజేందర్ ను గెలిపించండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. పేదల తరఫున మాట్లాడినందుకే సీఎం కేసీఆర్ ఈటలపై కక్ష పెంచుకొని పార్టీ నుండి బయటికి పంపారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఒప్పందం జరిగింది రాష్ట్రంలో కేసీఆర్ను సీఎం కేంద్రంలో రాహుల్ ను పీఎం చేయాలని. కాంగ్రెస్ టిఆర్ఎస్ ఎంఐఎం మూడు పార్టీలు ఒకటే. రాష్ట్రంలో ముస్లింలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్ తీసి వేస్తాం. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానమంత్రి మోడీ 60 లక్షలు కోట్లు ఇచ్చారు. రైతుల ధాన్యానికి మద్దతు ధర 3100 ఇచ్చి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని తెలిపారు.

బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ భూములు, ఇల్లు అమ్ముడు పోయిన మంచిదె కొట్లాడమని జెమునమ్మ చెప్పింది.నా మాదిగ జాతి 30ఏళ్లు పోరాడింది. ఇప్పుడు వారి పోరాటం సాకారం కాబోతుంది.తెలంగాణకు బిసి ముఖ్యమంత్రి కాబోతున్నాడు. కొంత మంది చిల్లర గాళ్ళతో తాను కుంగి పోయేలా చేసిన వ్యక్తి కేసీఆర్.తనపై అక్రమ కేసులు పెట్టాలని చూసిండు.మనం కొట్లాడేది కేసీఆర్ పైనా. చిల్లర గాళ్ళతో పని లేదు.నన్ను ఓడగొట్టెందుకు డబ్బు సంచులు, మందు సీసాలు వచ్చాయి. ఓటుకు రూ.5నుండి 10వేలు పంచాలని బీఆర్ ఎస్ వాళ్లు చూస్తున్నారు. నేను చేసిన రోడ్ల మీద నడుచుకుంటూ ఎం పని చేయలేదని చెప్పుతుర్రు. నేను ఏతులకు పోయే వ్యక్తిని కాదు. చేసిన పనులు చెప్పుకునే వాడిని కాదు. క్వింటాల్ ధాన్యానికి 6నుండి 8కిలోలు కోత పెడుతున్నారు. కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడే 
బిడ్డను కాదు. మాట అంటే మడుమ తిప్పని వ్యక్తి ఈటెల. గజ్వేల్ లో నిరుపేదలకు చెందిన  వేల ఎకరాల భూములను కేసీఆర్ లాక్కున్నడు.అక్కడ 30వేల మంది బాధితులు ఉన్నరు. నేను కూడా కేసీఆర్ బాధితుడినే. వారందరికి నేను నాయకత్వం వహిస్తాను.కొంత మంది నా దగ్గర ఉండి అన్ని అనుభవించి పోయారు.ఈటెలను ఓడగొట్టే దమ్ము కేసీఆర్ కు లేదు.