నేషనల్ పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నల్గొండ జిల్లా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం

నేషనల్ పీపుల్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నల్గొండ జిల్లా ప్రాంతీయ కార్యాలయం ప్రారంభం

చండూరు,  ముద్ర:నేషనల్ ఫోరం ఫర్ పీపుల్స్ ఎంపవర్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ నల్గొండ జిల్లా ప్రాంతీయ కార్యాలయం చండూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించడం జరిగింది, ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కంచర్ల నిశాంత్ సాగర్,బోమ్మరగోని కిరణ్ ఫిషర్ హైకోర్టు న్యాయవాదులు, కార్యాలయం ప్రారంభించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోరం, మానవ హక్కుల ఉల్లంఘన పై సమాజం లో జరిగే అవినీతి పై పోరాడుతూ, సమాజంలో రుగ్మతగా ఉన్న మూఢనమ్మకాలపై నిత్యం ప్రజలకు అవగాహన కల్పించడంలో ఫోరం ముందుంటుందని, న్యాయ చట్టాల పై అవగాహన కల్పిస్తూ, ప్రజలను చైతన్య పరుస్తుందని వారన్నారు, విద్య , వైద్యం నిరుద్యోగులకు ఉపాధి అంశాలపై, నిత్యం మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉంటుంది.

విద్యార్థి సమస్యల పైన మానసిక ఒత్తిడీ జయించడానికి నిపుణుల చేత కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వారన్నారు.విద్యార్థినిలకు మహిళా రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పిస్తూ, కోసం మహిళల అభ్యున్నతి కోసం సంస్థ పాటుపడుతుందిఅని అన్నారు.గ్రామీణ ప్రాంతాలలో రైతులతో సమన్వయమై రైతులకు ఉన్న ప్రధాన సమస్యలపై, రైతు చట్టాలపై అవగాహణ కల్పిస్తూ, రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందిఅని అన్నారు. పారిశ్రామిక అనుబంధ రంగాల కార్మికుల కోసం కార్మికుల చట్టాల పై వాళ్లకున్న హక్కులు తెలియజేస్తూ, నిత్యం వారికోసం ఫోరం అందుబాటులో ఉంటుందని అన్నారు, అదేవిధంగా నల్గొండ జిల్లా కన్వీనర్ గా అబ్బిడి రఘుమా రెడ్డి, కో కన్వీనర్ గా మండల నాగరాజు, కమిటీ సభ్యులుగా మారుతి, శివ, లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఈ సమావేశంలో ఆసిఫాబాద్ జిల్లా కన్వీనర్ శ్రీకాంత్, సైదులు, నవీన్, శివ, శివకుమార్, బాలు, తదితరులు పాల్గొన్నారు.