రైతు సంఘాల పిలుపుమేరకు ఆలేరులో కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో డబ్ల్యూటిఓ దిష్టిబొమ్మ దగ్ధం...

రైతు సంఘాల పిలుపుమేరకు ఆలేరులో కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో డబ్ల్యూటిఓ దిష్టిబొమ్మ దగ్ధం...

ఆలేరు (ముద్ర న్యూస్):కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) ఆధ్వర్యంలో చేస్తున్న శాంతియుత నిరసనపై నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న పాసిస్తు విధానాలకు వ్యతిరేకంగా సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో కార్మిక, రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి రాచకొండ జనార్ధన్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కేముడి ఉప్పలయ్య లు మాట్లాడుతూ ప్రపంచ వాణిజ్య సంస్థ మీదకే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగం పై ఆంక్షలు విధిస్తూ పాలన కొనసాగిస్తుందని ఆరోపించారు, బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం చేస్తున్న ఆందోళనను పక్కదారి పట్టించేందుకు చేసిన కుట్రలు విఫలం కావడంతో నేరుగా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు భారీ కేడ్లు, రోడ్లపై మేకులు, సిమెంటు బిల్లలతో అడ్డుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావటంతో ఏం చేయాలో తెలియక నరేంద్ర మోడీ ప్రభుత్వం పంజాబ్, ప్రియా నా రాష్ట్రాల సరిహద్దులో హర్యానాలోని బిజెపి ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీసులు రైతులపై అకారణంగా కాల్పులు జరిగి శాంతి యుత, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఉద్యమాన్ని హింసాత్మకంగా మార్చి సమాజానికి తప్పుడు సమాచారం అందించేందుకు నరేంద్ర మోడీ చేస్తున్న పుట్లను ఈ సందర్భంగా ఆక్షేపించారు.

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి నరేంద్ర మోడీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి తొమ్మిది సంవత్సరాలు అవుతున్న రైతులకు ఇచ్చిన కనీస మద్దతు ధర చట్టం చేయకుండా మల్టీ నేషనల్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు బ్యాంకుల నుండి తీసుకున్న భారీ రుణాలను రద్దు చేస్తూ దేశ ప్రజలపై ఆర్థిక ఫారాలు మోపుతూ దేశానికి అన్నం పెడుతున్న రైతాంగాన్ని పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్యగా వారు అభివర్ణించారు, కార్పొరేట్ సంస్థల కను సైగలలో పనిచేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతన్నలను విదేశీయులు గా పరిగణిస్తూ కనీస ప్రజాస్వామిక హక్కులను రైతాంగానికి లేకుండా చేస్తున్న దుర్మార్గ చర్యలను రైతాంగం ఆక్షేపిస్తూ, తమ హక్కుల సాధన కోసం నిరసన వ్యక్తం చేసేందుకు రోడ్లపైకి హక్కును కూడా కాల రాయడం రామరాజ్యం పేరుతో నరేంద్ర మోడీ చేస్తున్న రాక్షస పాలనకు నిదర్శనం అని అన్నారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం నిత్యం జపించే స్వదేశీ విధానాన్ని అమలు చేసేందుకు వెంటనే రైతాంగానికి కనీస హక్కులను, పంటలకు మద్దతు ధరను వెంటనే చెల్లించి సమగ్ర చట్టం రూపొందించాలని డిమాండ్ చేశారు, లేకుంటే రానున్న పార్లమెంటు ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో పి వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బేజాడి కుమార్ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బర్మ బాబు, తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు గడ్డం మంకయ్య, జిల్లా నాయకులు ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు చీరబోయిన కొమరయ్య, వంగాల నరసింహారెడ్డి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఊరడి రామచంద్రు, కుర్రి మార్కండేయ, ఇక్కిరి కుమార్, అరుణోదయ జిల్లా నాయకులు నమిలే అంజిబాబు, కొమ్మిడి గోపాల్ రెడ్డి, శికిలం వెంకటేష్, ఓరుగంటి మైసయ్య, గుండె బీరు మల్లయ్య తోపాటు తదితరులు పాల్గొన్నారు....