ఘనంగా తొంట భాస్కర్ జన్మదిన వేడుకలు

ఘనంగా తొంట భాస్కర్ జన్మదిన వేడుకలు

మోత్కూర్(ముద్ర న్యూస్) : 108 ఉద్యోగుల సంక్షేమ సంఘ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దళిత బహుజన సిద్దాంతం కలిగిన తొంట భాస్కర్ జన్మదినం సందర్భంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తుంగతుర్తి శాసనసభ్యులు  గాదరి కిశోర్ కుమార్ ను హైదరాబాద్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా కేకు కట్ చేసి బాస్కర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మోత్కూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహెంద్రనాధ్, మోత్కూరు, అడ్డగూడురు మండల పార్టీ అధ్యక్షులు పొన్నేబోయిన రమేష్ కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మోత్కూరు మండల రైతుబందు అధ్యక్షులు కొండ సోమల్లు, అడ్డగుడూరు ఎంపీపీ దర్శనాల అంజయ్య, అడ్డగుడుర్ మండల సింగిల్ విండో ఛైర్మెన్ పొన్నాల వెంకటేశ్వర్లు, బిఆర్ఎస్ నాయకులు శ్రీరాముల అయోధ్య, ఎస్సి, ఎస్టి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ మెంబర్ దాసరి తిరుమలేష్, మోత్కూర్ ఏస్సిసెల్ మున్సిపాలిటీ అధ్యక్షులు చెడిపెల్లి రఘుపతి,కూరెల్ల ప్రభు తదితరులు పాల్గొన్నారు.