ఘనంగా వంగవీటి రంగా జయంతి....

ఘనంగా వంగవీటి రంగా జయంతి....

మునగాల ముద్ర:-మునగాల మండల కేంద్రంలో వంగవీటి రంగా యూత్ అధ్యక్షుడు  పసుపులేటి గోపి  ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వంగవీటి మోహన్ రంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైస్ ఎంపీపీ కొలిశెట్టి బుచ్చి పాపయ్య, ఎంపీటీసీ కాసర్ల కల్పనా శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కాసర్ల కోటేశ్వరరావు హాజరై చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పేదల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా  ఆని కొని ఆడారు. ఈ కార్యక్రమానికి వంగవీటి మోహన్ రంగా యూత్ సభ్యులు కుందూరు అప్పారావు, పరమాత్ముల మధు, కాసర్ల రాజేష్, కుందూరు వెంకట రామనరసయ్య, కుందూరు సీతారామయ్య, తాటికొండ సురేష్, కాసర్ల వెంకన్న యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.