తెలంగాణ ఏర్పాటులో న్యాయవాదుల కృషి గొప్పది: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

తెలంగాణ ఏర్పాటులో న్యాయవాదుల కృషి గొప్పది: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి భువనగిరి :తెలంగాణ ఏర్పాటులో న్యాయవాదుల కృషి గొప్పదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయవాదుల సమావేశం వివేరా హోటల్లో భువనగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగారం అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, సోమ భరత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటులో న్యాయవాదుల కృషి ఎంతో ఉందన్నారు.

న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం ముందుందన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ న్యాయవాదులంతా కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, పైల లింగారెడ్డి, సిద్ధిరాములు, జయపాల్, డప్పు మల్లయ్య, వీరస్వామి, రావుల రవీందర్ రెడ్డి, జూకంటి రవీందర్, నల్లగొండ, సూర్యపేట రామన్నపేట, చౌటుప్పల్, ఆలేరు, భువనగిరి ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్వకేట్స్ పాల్గొన్నారు.