నిన్న కారు దిగి కాంగ్రెస్ లోకి  నేడు కారులోకి 

నిన్న కారు దిగి కాంగ్రెస్ లోకి  నేడు కారులోకి 
  • నిన్న కారు దిగి కాంగ్రెస్ లోకి  నేడు కారులోకి 
  • ఉప్పరి రవీందర్ 48 గంటల్లో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ లోకి

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:  రాబోయే అసెంబ్లీ ఎన్నికలు ప్రజా ప్రతినిధులకు అగ్నిపరీక్షగా మారుతుంది. నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థులపై అలిగి రోజుకో పార్టీ మారుతున్నారు.  దీంతో ఎమ్మెల్యే గా పోటీ చేసే అభ్యర్థులు ఏం చేయాలో తెలియకా తలలు పట్టుకుంటున్నారు. పార్టీ మారిన నాయకులను కార్యకర్తలను బుజ్జగించి బుట్టలో వేసుకుంటున్నారు.  ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని చిత్ర విచిత్రాలు చూడలో
నిన్న కారు దిగి కాంగ్రెస్ పార్టీలో కలిసిన నాయకుడు నేడు ఎమ్మెల్యే సమక్షంలోనే 48 గంటల్లో మళ్లి కారు ఎక్కాడు... పెద్దపల్లి మండలం సబ్బితం గ్రామానికి చెందిన ఉప్పరి రవీందర్ తిరిగి సొంత గూటికి చేరారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఉప్పరి రవీందర్ 48 గంటల్లోనే తిరిగి బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు, ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు మహేందర్, రహీం, తాళ్ల శేఖర్, చుంచు సతీష్, ఉప్పరి సందీప్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.