సంపద పెంచండి.. ఇతరులకు పంచండి

సంపద పెంచండి.. ఇతరులకు పంచండి
  • విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందాలి
  • ప్రకృతిని ప్రేమించండి అది మిమ్మల్ని ప్రేమిస్తుంది
  • భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 

ముద్ర ప్రతినిధి, వరంగల్: టెక్నాలజీలో భారత్ ముందుకు వెళుతుంది ఆ దిశగా యువత నూతన జాతీయ విద్యా విధానం పై దృష్టి సారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. హనుమకొండ జిల్లాలోని నయీమ్ నగర్ లోని చైతన్య డీమ్డ్  యూనివర్సిటీలో శనివారం 11వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇష్టమైన పనిలో కష్టపడితే నష్టం లేదని ఇష్టం లేని పనిలో సమయాన్ని వృధా చేసుకుంటే జీవితంలో ఎంతో కోల్పోతామని అన్నారు. చదువుతున్న దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో ముందంజలో ఉందని, దానికి అనుగుణంగానే మనం మేధస్సుకు పదును పెట్టి ఊటీ ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మరింత వృద్ధి చెందవచ్చు అని ఆయన తెలిపారు. దీనిలో భాగంగానే భారత్ ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. నాలుగో అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుందని తెలిపారు.

విద్యాలయాల్లో తరగతి గది వరకే విద్య పరిమితి కాకుండా విద్య పరిణతి చెందాలని ఆయన సూచించారు.ఇంగ్లీష్ భాష నేర్చుకోండిమమ్మీ డాడీ సంస్కృతి మనకు అవసరమా మాతృభాష కళ్ళలాంటిదని ఇంగ్లీష్ భాష కళ్లద్దాల లాంటిదని ఇంగ్లీష్ ఒక భాష మాత్రమేకానీ సంస్కృతి కాదు అని ఆయన ఉచ్చరించారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్న మనమంతా భారతీయులమే అన్న విషయాన్ని యువత మరిచి పోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానా న్ని అవలంబించిందని పోటీ పరీ క్షల్లో ఆయా రాష్ట్రాల మాతృభా షలోనే పరీక్ష రాసి వెసులుబాటు కల్పించిందని  ఆయన సూచించా రు. దీనికి అనుగుణంగానే  ప్రభుత్వ పాలన కొనసాగుతుందని తెలిపా రు.

యువత ప్రకృతిని ప్రేమించడం నేర్చుకోవాలని అలాగే ప్రకృతిని ఆ స్వాదించి ఉత్తేజ కరమైన ఆలోచన లకు పురుడు పోయాలని తెలిపా రు.  ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నామ ని దానివల్ల ప్రకృతి వైపరీత్యాలు ఏర్పాటు ఎన్నో వేలమంది చని పోతున్నారని అన్నారు. దీనికి కారణం కేవలం మానవ తప్పిదాలు  మాత్రమే అని ఉద్ఘాటించారు. ఓరుగల్లు కు ఓ చరిత్ర ఉంది... పోరాట పటిమ ఉంది. కవులు కలలకు  విజ్ఞానకనిగా ఓరుగల్లుకి పేరు ఉందని ఆ పేరును యువత ఆదర్శంగా తీసుకొని నిలబెట్టాలని ఈ సందర్భంగా ఆయన ఉపన్యసిం చారు. చివరిగా యువతకు స్ఫూర్తి నిచ్చే మంచి విషయాలను చెబుతూ సంపద పెంచండి.ఇతరులకు పం చండి అనే నినాదంతో తన ప్రసంగా న్ని ముగించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వి రమణ రావు, మాజీమంత్రి ఇనుగా ల పెద్దిరెడ్డి, కళాశాల చైర్మన్ పురు షోత్తం రెడ్డి, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.