కిడ్నీలు చెడిపోయి యువకుడు మృతి

కిడ్నీలు చెడిపోయి యువకుడు మృతి

ముద్ర, ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం  సింగారం గ్రామానికి చెందిన సంపంగి రాజు 24 రెండు కిడ్నీలు చెడిపోయి చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి  మృతి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం ఒడ్డెర కులానికి చెందిన సంపంగి మల్లయ్య రెండో భార్య కుమారుడు గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ  హైదరాబాద్  నిమ్స్ ఆస్పత్రిలో లో చికిత్స పొందగా  తన ఆరోగ్యం విషమంగా ఉండడంతో  వైద్యులు ఇంటికి తీసుకెళ్ళమని చెప్పగా రెండు రోజుల క్రితం తన స్వగ్రామం సింగారం గ్రామానికి తీసుకురాగా అర్ధరాత్రి మరణించాడు. మృతునికి ఒక సోదరి కూడా ఉన్నది.రాజు మరణ వార్త విన్న సింగారం సింగారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూలి పని చేసుకునే కుటుంబంలో  కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో లక్షల రూపాయలు అప్పు చేశారని తన కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని సర్పంచ్ మంగోలి నర్సాగౌడ్, ఎంపీటీసీ మధు, గ్రామస్తులు కోరుతున్నారు.