పట్టుకున్నారు వదిలేశారు

పట్టుకున్నారు వదిలేశారు
  • 17 ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న ఎల్లారెడ్డిపేట పోలీసులు
  • పత్రాలు పరిశీలించి వదిలిపెట్టాం ఎస్సై ప్రేమ్ దీప్


ముద్ర,ఎల్లారెడ్డిపేట :అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పట్టుకున్న 17 ఇసుక ట్రాక్టర్లను శుక్రవారం వదిలిపెట్టిన సంఘటన వెలుగు చూసింది.ఎస్సై ప్రేమ్ దీప్  వివరాల ప్రకారం శుక్రవారం వెంకటాపూర్ గ్రామానికి చెందిన 17 ఇసుక ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తున్నారని సమాచారంతో పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి అనంతరం ఇసుక ట్రాక్టర్ల అనుమతి పత్రాలు పరిశీలించగా ఈనెల 4 వ తేదీ ఉండడంతో పట్టుకోవడం జరిగిందని సంబంధిత ట్రాక్టరు  యజమానులు పోలీస్ స్టేషన్ కు వచ్చి అనుమతి పొందిన రోజున వర్షాలు కురవడంతో ఇసుకను తరలించలేకపోయామని అట్టి తేదీని మండల తహసిల్దార్ జయంత్ కుమార్ ని కలిసి ఈరోజుకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరగా ఇసుక అనుమతి పత్రాలపై తేదీని మార్చడం జరిగిందని తెలుసుకున్న తర్వాత వదిలిపెట్టడం జరిగిందని ఎస్సై ప్రేమ్ దీప్ తెలిపారు.