సీఎం కెసిఆర్ పర్యటనలో ఆసక్తికర సంఘటన

సీఎం కెసిఆర్ పర్యటనలో ఆసక్తికర సంఘటన

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి :కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కుమారునికి వివాహానికి సిఎం గారు హాజరైన సందర్భంగా ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.తమ నియోజకవర్గం, కామారెడ్డి లో పోటీ చేయాలని ఇప్పటికే నిర్ణయించుకున్న సిఎం కేసీఆర్ ను స్వాగతిస్తూ, పెండ్లి కి హాజరైన కామారెడ్డి నియోజక వర్గ ప్రజలు, యువత హర్షాతిరేకాలతో కేరింతలతో స్వాగత నినాదాలు ఇచ్చారు." సిఎం కేసీఆర్ రావాలి" "స్వాగతం కామారెడ్డికి స్వాగతం" "కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి" "జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసిఆర్" అనే నినాదాలతో పెళ్లి ప్రాంగణం దద్దరిల్లింది.వారికి కరచాలనం చేస్తూ, ఫొటోలకు అవకాశమిస్తూ, దారి పొడవునా అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ అధినేత ముందుకు సాగారు.