లక్ష్యం సాధించెంత వరకు యువత విశ్రమించవద్దు: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

లక్ష్యం సాధించెంత వరకు యువత విశ్రమించవద్దు: ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
  • మీ ప్రయత్నం సక్సెస్ కావాలని  ఆకాంక్షిస్తున్న
  • తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్  డెవలప్ మెంట్ సెంటర్ ను సందర్శించిన శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి
  • టాస్క్ లో శిక్షణ పొంది ఉద్యోగాలు సాదించిన విద్యార్ధులను అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
  • విద్యార్థుల నైపుణ్యం  పెంపు కోసం ల్యాప్ టాప్ ల ను అందచేసిన జగదీష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తాము అనుకున్న లక్ష్యం చేరుకునే వరకు యువత విశ్రమించకూడదు అని సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. ఐటి హబ్ లో ఉద్యోగాల ఎంపిక కోసం 500 మంది  యువతి యువకుల కు టెక్  విజన్ , షాఫ్ట్ సాప్ట్ వేర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు శిక్షణ ఇస్తున్న తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ను  జగదీష్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయత్నం చేయకుండా ఏది మన సొంతం  కాదని, తమ లక్ష్యం సాధించినంత వరకు రాజీ లేకుండా చేసే కృషి ద్వార యువత ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు.

బావి ఇంజనీర్లుగా తమను తాము తీర్చిదిద్దుకునెందుకు సూర్యాపేటలో టాస్క్ సెంటర్  లో  శిక్షణ పొందుతున్న విద్యార్థులందరి ప్రయత్నం సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లు జగదీష్ రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా టాస్క్ లో శిక్షణ పొంది కార్పొరేట్ కంపెనీలలో సంవత్సరానికి 20,15 లక్షల వేతనంతో ఉద్యోగాలు పొందిన యువతుల కు మంత్రి అభినందనలు తెలిపారు.విద్యార్థుల నైపుణ్యం  పెంచుకోవడం లొ  ప్రధాన భూమిక అయిన ల్యాప్ టాప్ ల ను  ప్రముఖ  సాప్ట్ వేర్ సంస్థ సిజిఐ స్పాన్సర్ చేయగా, వాటిని టాస్క్  సంస్థ కు  జగదీష్ రెడ్డి గారు అందజేశారు. కార్యక్రమం లో సాఫ్ట్ వేర్కంపెనీలకు చెందిన ప్రతినిధులు కొణతం సైదిరెడ్డి, యలక గోపిరెడ్డి, కొండపల్లి పవన్ రెడ్డి లు పాల్గొన్నారు.