ముద్ర కథనానికి కదిలిన ఝాన్సీ రెడ్డి

ముద్ర కథనానికి కదిలిన ఝాన్సీ రెడ్డి
  • పంట పోలాలు ధ్వంసమైన రోడ్ల పరిశీలన
  • కమిషన్ల కోసం నాణ్యత లేమితో పనులు
  • నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండు
  • జీపి కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన ఝాన్సీ రెడ్డి 

ముద్ర, వర్థన్నపేట: భారీ వర్షాలు, వరదలతో  నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని  పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ ఝాన్సీ రెడ్డి డిమాండు చేశారు."జూలై నెల 31వ తేదిన" జాడలేనీ ఝాన్సీ రెడ్డి "అనే కథనానికి  ఝాన్సీ రెడ్డి కదిలి రాయపర్తి లో పర్యటించారు..బుధవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం  కేంద్రంలో జీపి కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు.అనంతరం  పేరికేడు,గట్టికల్లు ఊకల్లు  గ్రామాల్లో వరదల వల్ల దెబ్బతిన్న పంటపొలాలను  రోడ్లను పరిశీలించారు.అనంతరం జరిగిన పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.కమీషన్ల కోసమే నాణ్యత లేమితో పనులు చేస్తున్నరనీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాచర్ల ప్రభాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హమ్య నాయక్ , బూడిద .రవి, సురేందర్ రెడ్డి,పల్లె .దేవేందర్ ,వినోద్ ,శ్రీను ,రమేష్ , మద.రాజు,సంతోష్,భాస్కర్ ,హరీష్ , యాకుబ్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.