తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ రుణాన్ని తీర్చుకుందాం

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ రుణాన్ని తీర్చుకుందాం

మాజీ మంత్రి జూపల్లి తనయుడు జూపల్లి అరుణ్

ముద్ర/ వీపనగండ్ల: ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణాన్ని తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి జూపల్లి తనయుడు జూపల్లి అరుణ్ అన్నారు. మండల పరిధిలోని సంగినేనిపల్లిలో కొల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి జూపల్లి గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపల్లి అరుణ్ మాట్లాడుతూ కొల్లాపూర్ ప్రజలకు కెసిఆర్ కు అమ్ముడుపోయే నాయకులు కావాలా లేక కొల్లాపూర్ ఆత్మ గౌరవం కోసం కెసిఆర్ పై పోరాడే నాయకులు కావాలా అని ప్రజలు నిర్ణయించుకొని ఓటు వేయాలని సూచించారు. హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గా గెలిపిస్తే మూడు నెలలకే అమ్ముడుపోయారు అని అలాంటి ఆణిముత్యం కొల్లాపూర్ ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని అన్నారు.

నీళ్లు నిధులు నియామకాలు అంటూ  తెలంగాణ ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని, ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పడని, దళితులకు మూడెకరాల భూమి, లక్ష రూపాయల రుణమాఫీ, నిరుద్యోగ సమస్యను గాలికి వదిలేసారని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే సోనియమ్మ ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రజలకు వివరించారు, కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఎంపిటిసిల ఫోరమ్ అధ్యక్షుడు ఇంద్రకంటి వెంకటేష్, మండల రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు నారాయణరెడ్డి, నాయకులు రామిరెడ్డి, ధనుంజయ, చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.