బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే తండాల అభివృద్ధి

బిఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే తండాల అభివృద్ధి

స్టేషన్ ఘనపూర్ బిఆర్ ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి

ముద్ర, జఫర్‌గడ్ : గిరిజనుల అభివృద్ధి కోసం తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలని తండాలను మరింత అభివృద్ధి చేసుకుందామని స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు బుధవారం జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని కేజీ తండా, టీబీ తండా, రేగడి తండా, కష్టతండ, శంకర్ తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఏ రోజు కూడా తండాలను పట్టించుకోలేదని విమర్శించారు.

గిరిజనుల అభివృద్ధి కోసం కెసిఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. కెసిఆర్ గిరిజనుల సంక్షేమం కోసం పెద్దపీట వేశారన్నారు. తండాలను మరింత అభివృద్ధి చేసుకోవాలంటే నన్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, జడ్పిటిసి ఇల్లందుల బేబీ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు, మండల ఇంచార్జ్, మాజీ మార్కెట్ చైర్మన్ అన్నం బ్రహ్మ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్ రావు, వైస్ ఎంపీపీ కొడాలి కనకయ్య భానోత్ రాజేష్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు