కాలిటన్ కరికో, డ్రూ వెయిస్​మన్​కు నోబెల్

కాలిటన్ కరికో, డ్రూ వెయిస్​మన్​కు నోబెల్
  • కొవిడ్ వ్యాక్సిన్ ​అభివృద్ధి చేసినందుకు పురస్కారం

న్యూఢిల్లీ: కొవిడ్​వ్యాక్సిన్​అభివృద్ధికి కృషి చేసిన ఇద్దరు వైద్యులను నోబెల్​ప్రైజ్​కు ఎంపిక చేసినట్లు నోబెల్​అసెంబ్లీ సోమవారం తెలిపింది. వైద్యులు కాలిటన్ కరికో, డ్రూ వెయిస్​మన్​కు నోబెల్ పురస్కారం అందజేయనున్నట్లు ప్రకటించింది. మానవాళిపై పంజా విసిరికి కరోనా కట్టడి కోసం వ్యాక్సిన్లు తయారు చేయడంలో వీరి కృషి అమోఘమైందని, అందుకు వీరిని అవార్డుకు ఎంపిక చేసినట్లు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్ జ్యూరీ ప్రకటించింది.  2023 నోబెల్ బహుమతులకు ఎంపికైన వారి పేర్లను రోజుకో రంగం చొప్పున వారం రోజులపాటు వెల్లడించనున్నారు. వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రదానం.. మంగళవారం ఫిజిక్స్, బుధవారం కెమిస్ట్రీ, గురువారం సాహిత్య విభాగాల్లో ఎంపికైన వారి పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం 2023 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 9 న ఎకనమిక్స్‌లో ఈ నోబెల్‌ పురస్కారాన్ని దక్కించుకున్న వారి పేర్లను విడుదల చేయనున్నారు. గతేడాది నోబెల్ బహుమతులు అందుకున్న వారికి 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల డబ్బును అందించారు. మన భారత కరెన్సీలో దీని విలువ రూ.7.58 కోట్లు. అయితే ఈ మొత్తాన్ని ఈసారి 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల నుంచి 11 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్లకు పెంచారు. అంటే ఈసారి నోబెల్ పురస్కారం అందుకున్న వారు రూ.8.35 కోట్లు అందుకోనున్నారు.