బీజేపీకు బిఆరెస్ బి టీమ్            

బీజేపీకు బిఆరెస్ బి టీమ్            
  • అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలండి                               
  • కర్నాటక సిఎం సిద్దిరామయ్య                                  

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: బీజేపీ పార్టీకి బిఆరెస్ బి టీం అని, అవినీతి ప్రభుత్వాన్ని పారద్రోలండని కర్నాటక సీఎం సిద్దిరామయ్య అన్నారు. శుక్రవారం కామారెడ్డి లోని ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన బిసి డిక్లరేషన్ సభలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంచార్జి మాణిక్యం ఠాకూర్, మాజీమంత్రి షబ్బీర్ అలీ, సీపీఐ నాయకులు చాడా వెంకటరెడ్డి, నారాయణ, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం లతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా కర్నాటక సిఎం మాట్లాడుతూ తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వం గద్దె   దిగనున్నదని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. కర్ణాటక లో 5 డిక్లరేషన్లను ప్రకటించి నిధులు కేటాయించి అమలు చేస్తున్నామని, అక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. సీఎం కేసీఆర్ కర్ణాటక లో హామీలు అమలు కావడం లేదని అబద్ధాలు చెబుతున్నారని, కర్ణాటక కు రావాలని, మా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం తెలుస్తుందని సవాలు చేసారు.  

పీఎం మోడీ తెలంగాణ లో వంద సభల్లో పాల్గొని, రోడ్ షోల్లో పాల్గొన్నా, 4-5 సీట్ల కన్నా ఎక్కువ రావని అన్నారు. తన జీవిత కాలంలో ఇంత అసమర్థ పిఎంను చూడలేదని, లక్షలాది కోట్ల అప్పు చేసి, దేశ తలసరి ఆదాయాన్ని అధోగతి పాలుచేశారని అన్నారు.  కామారెడ్డి లో, కొడంగల్ లో రేవంత్ రెడ్డిని గెలిపించాలని సీనియర్ నేత వి.హన్మంత్ రావు అన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ని సోనియా గాంధీ ప్రకటిస్తారని, కాంగ్రెస్ లో ఎవరూ తాను సీఎం అభ్యర్థిగా ప్రకటించుకోవద్దని సూచించారు. అంతకుముందు మహేశ్ కుమార్ గౌడ్ బిసి డిక్లరేషన్ ప్రవేశపెట్టారు.

డిక్లరేషన్ వివరాలు:

50 ఏళ్లు దాటిన నేతన్నలకు పెన్షన్

బీసీల అభివృద్ధికి ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు ఖర్చు.

బీసీ సబ్ ప్లాన్, ప్రతి మండలానికి బీసీ గురుకుల స్కూల్ ఏర్పాటు.

50 ఏళ్లు దాటిన నేత కార్మికులకు పెన్షన్, బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కరికి రూ.10 లక్షల రుణం.

స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ 42 శాతానికి పెంపు.

BC-Dలో ఉన్న ముదిరాజ్ కులస్తులను BC-Aలో మార్పు.