అంతర్ విశ్వవిద్యాలయాల క్రికెట్ పోటీలకు కోరుట్ల రామకృష్ణ విద్యార్థి ఎంపిక

అంతర్ విశ్వవిద్యాలయాల క్రికెట్ పోటీలకు కోరుట్ల రామకృష్ణ విద్యార్థి ఎంపిక

ముద్ర, కోరుట్ల: హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ టోర్నమెంట్ లో శాతవాహన యూనివర్సిటీ తరపున పోటీలలో పాల్గొనడానికి స్థానిక రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో బీకాం రెండవ సెమిస్టర్ చదువుతున్న నిమ్మల కళ్యాణ్ ఎంపికయ్యాడు. ఇటీవల కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో జరిగిన క్రికెట్ పోటీల్లో రాణించాడు. ఈ సందర్భంగా కళ్యాణ్ ను కళాశాల కరస్పాండెంట్ యాద రామకృష్ణ, డైరెక్టర్లు గాడి పెళ్లి హరిప్రియ, అంజయ్య గౌడ్, ప్రిన్సిపాల్ బెజ్జారపు ప్రవీణ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ దయాత్రి శ్రీనివాస్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.