( వీడియో ) - లాస్యనందిత సోదరి నివేదిత కీలక ప్రకటన

ముద్ర,తెలంగాణ:- ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె సోదరి నివేదిత కీలక ప్రకటన చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో తాను బరిలో ఉండనున్నట్లు తెలిపారు. చెల్లి లాస్య నందిత గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలబడేందుకు, అందరి సమిష్టి నిర్ణయం మేరకు ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిపారు. త్వరలోనే కేసీఆర్ ను కలవనున్నట్లు  ఆమె చెప్పారు.