స్వర్గీయ మాజీ ప్రధాని నెహ్రు వర్ధంతి

స్వర్గీయ మాజీ ప్రధాని నెహ్రు వర్ధంతి

కేసముద్రం, ముద్ర: స్వర్గీయ భారత మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి వేడుకలు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర వహించి, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొట్టమొదటి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా అనేక నీటి ప్రాజెక్టులను కట్టించి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత నెహ్రు దేనన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, పోలెపాక నాగరాజు, అయూబ్ ఖాన్, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఇస్లావత్ చందు, ఎంపీటీసీ ధరావత్ బాలు నాయక్, కీర్తి సురేందర్, కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, తరాల సుధాకర్, పరాంకుశం శ్రీహరి, సామ సుధాకర్, వాంకుడోత్ బీలియా పాల్గొన్నారు. ఇనుగుర్తి మండల కేంద్రంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. నెహ్రు చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు తోట వెంకన్న, రాజేందర్ రెడ్డి, మహేందర్, సతీష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.