ఇంద్రకరణ్ ను ఇంటికి పంపిద్దాం: బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి

ఇంద్రకరణ్ ను ఇంటికి పంపిద్దాం: బిజెపి నేత మహేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నిర్మల్: అవినీతి, బంధుప్రీతి లో కూరుకుపోయిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ని ఇంటికి పంపడం, నిర్మల్  బిజెపి కైవసం ఖాయమని బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కమల్ కోట లో 150 మందికి పైగా బిజెపి లో శనివారం చేరిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ భూముల కబ్జాలకు పాల్పడుతూ, తన వారి ప్రయోజనాలే తప్ప ప్రజా సంక్షేమం పట్టని ఇలాంటి నేతలు వద్దన్నారు. చెరువులు కూడా ఆక్రమించుకున్న ఇలాంటి నేతలకు ఓట్లేయటం దండగ అన్నారు. అంతకు ముందు గ్రామంలో మోటార్ సైకిళ్ళ ర్యాలీ నిర్వహించారు.