కథ వెనుక కథలో లిరికల్​సాంగ్​

కథ వెనుక కథలో లిరికల్​సాంగ్​

క‌న్నూ క‌న్ను చాలంట‌ ఆ చూపే చెప్పే సైగ‌లోనే మాయుందే అంటూ ప్రేయ‌సి త‌న ప్రేమికుడిని చూసి చెబుతుంది. వీరిద్దరూ స‌ముద్ర తీరంలో త‌మ ప్రేమ‌ను అందంగా ఒక‌రిపై ఒక‌రు వ్యక్తం చేసుకుంటున్నారు. అస‌లు వీరి మ‌ధ్య అంత గాఢ‌మైన ప్రేమ ఎందుకు పుట్టింది.. అందుకు దారి తీసిన ప‌రిస్థితులేంటి? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ‘క‌థ వెనుక క‌థ‌’ సినిమా చూడాల్సిందేనంటున్న మేకర్స్. కొత్త కాన్సెప్ట్ చిత్రాల‌ను అందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయటానికి ప్రారంభ‌మైన నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్.

ఈ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. కృష్ణ చైత‌న్య ద‌ర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవ‌నింద్ర కుమార్ నిర్మిస్తున్నారు.  సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందుతోన్న ఈ సినిమా నుంచి ‘నిన్ను చూసీ చూడంగా ..’ అనే పాటను లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.