మాధవే మధుసూదన అంటున్న చైతు

మాధవే మధుసూదన అంటున్న చైతు

బొమ్మదేవర శ్రీదేవి సమర్పణలో సాయి రత్న క్రియేషన్స్ పతాకంపై తేజ్ బొమ్మదేవర, రిషిక  జంటగా బొమ్మదేవర రామచంద్ర రావు దర్శక, నిర్మాణ సారధ్యంలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి హీరో నాగ చైతన్య ముఖ్య అతిథిగా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా నాగ చైతన్య మొదటి పాటను ఆవిష్కరించారు. అనంతరం నాగ చైతన్య మాట్లాడుతూ.. మాధవే మధుసూదన సినిమా నుంచి అలాంటి అందం సాంగ్ చూడడం జరిగింది. చాలా చాలా బావుంది. మొదటగా తేజ్ కి కంగ్రాట్యులేషన్ చెప్పాలి. బ్రదర్ నీ డాన్స్ చాలా బావుంది. యాక్టింగ్ బావుంది, అలాగే లుక్ అన్ని బాగా కుదిరాయి.

ఇక మా చంద్ర గురించి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. చిన్నప్పుడు నాకు ఒక కెమెరా అంటే తెలియనప్పుడు హాలిడేస్ లో నాన్న షూటింగ్స్ కి వెళుతుండేవాడిని. అక్కడ చంద్ర పక్కనుండి అన్నీ నేర్పించారు. అలాంటి చంద్ర ఇవ్వాళా ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసాడు అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు చూపించిన పాట నేను ఎక్స్పెక్ట్ కూడా చెయ్యలేదు. చంద్ర ఇంతబాగా హ్యాండిల్ చేస్తారని, వెరీ వెరీ హ్యాపీ అన్నారు నాగ చైతన్య. సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మాధవే మధుసూదన కథ చాలా మంచి కథ, చాలా ఫీలున్న కథ. మంచి ఎమోషన్ అండ్ లవ్ స్టోరీ చాలా బావుంది, ఇవ్వాళ్లున్న యూత్ బాగా కనెక్ట్ అవుతారని బాగా నమ్ముతున్నాను. చంద్ర గురించి చెప్పాలంటే ఆయన ఆల్ రౌండర్. చంద్ర గారు తీసిన అవుట్ ఫుట్ చూస్తుంటే ఆనందంగా ఉంది. చంద్రకి సినిమా అంటే ఎంత పిచ్చో నాకు బాగా తెలుసు. ఇక డైరెక్టర్ టీమ్ అందరికి ఆల్ ద వెరీ బెస్ట్ అన్నారు నాగ చైతన్య.