ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే సతీమణి ఆర్తి రెడ్డి
ముద్ర ప్రతినిధి, వికారాబాద్:తాండూరు మునిపల్ వ్యాప్తంగా పైలెట్ రోహిత్ రెడ్డి సతీమణి ఆర్తీ రెడ్డి ప్రచారంలో అభివృద్ధికే తమ ఓటు అంటూ వేయాలని చెబుతున్నారు.తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విజయాన్ని అభ్యర్థిస్తూ తాండూరు మున్సిపల్ వ్యాప్తంగా పర్యటించి భారీ మెజార్టీ అందించాలని ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
బుధవారం కార్య కర్తలు, మహిళల తో కలిసి తాండూర్ లో బీఆర్ఎస్ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.తాండూరు అభివృద్ధి చేసింది రోహిత్ రెడ్డి నే అని మరో సారి మీరు ఓటు వేసి ఆశీర్వదించి గెలిపించండి,మరింత అభివృద్ధి చేసి చూపిస్తాడు అని కోరారు. తాండూర్ పట్టణంలో, నియోకవర్గస్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను తెచ్చిన ఘనత రోహిత్ రెడ్డి కే దక్కిందని అన్నారు. కాలుష్య రహిత తాండూరు గా మర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడని వార్డ్ ప్రజలకు వివరించారు. ఈ ఎన్నికల్లో మరో సారి రోహిత్ రెడ్డి ని తిరిగి భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు.