భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సిపిఎం ను గెలిపించండి

భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సిపిఎం ను గెలిపించండి
  • నిబద్ధతతో పనిచేసే వ్యక్తి ఎండి. జహంగీర్
  • కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు


ముద్ర ప్రతినిధి భువనగిరి: రాజకీయాల్లో విలువలు భ్రష్టు  పడుతున్న కాలంలో వాటిని కాపాడడానికి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఎండి.జహంగీర్  సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి సుందరయ్య భవన్లో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ తో కలిసి విలేకరుల సమావేశం లో  ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర కమిటీల నిర్ణయం మేరకు భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుంది అన్నారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలో కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని తెలిపారు. గతంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు, భువనగిరి, ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజలకు ఎర్రజెండా ఉద్యమ పోరాట  పటిమ వాటి ఫలితాలు తెలుసని తెలిపారు. నిబద్ధత, నిక్కాచిగా పనిచేసే ఎండి జహంగీర్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎండి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వ్యక్తి అని తెలిపారు.

నిరుపేద అయి 35 సంవత్సరాలుగా సిపిఎం సభ్యత్వం తీసుకొని 32 సంవత్సరాలుగా సిపిఎం పూర్తి కాలం కార్యకర్తగా జహంగీర్ పనిచేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శిగా ఈ ప్రాంతంలో నిర్వహించిన అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని తెలిపారు. తండ్రి మహబూబ్ అలీ ఆ గ్రామం లో పార్టీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి అన్నారు. మిగతా పార్టీల అభ్యర్థులు సిపిఎం ప్రకటించిన జహంగీర్ అనే అభ్యర్థిని పూర్తిగా పరిశీలించి ఓటర్లు విజ్ఞతతో ఓటు వేయాలన్నారు . పేదరికం జిల్లాలోని పలు సమస్యలపై అవగాహన ఉన్న ఎండి జహంగీర్ పూర్తి కాలం సిపిఎం కార్యకర్తగా పనిచేస్తున్నారని తెలిపారు.

నేటి దేశ లోని పరిస్థితులు అయ్యారాం అనే మాదిరిగా మారింది అన్నారు ఇటీవల మంత్రి మల్లారెడ్డి తను పార్ట్ టైం రాజకీయ నాయకుడిగాని ఫుల్ టైం బిజినెస్ అని అంటూ వాక్యానించిన విషయాలు గుర్తు చేశారు. ఇతర పార్టీలలో పోటీ చేసే అభ్యర్థులు ఆకోవకు చెందిన వ్యక్తులే అని ప్రజలు గ్రహించాలన్నారు. బూర్జువా పార్టీలలో ఉంటూ, ఎటు అధికారం వస్తే అటువైపు వెళుతున్న నాయకులకు ఈ ఎన్నికలలో ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. వారు ప్రజాస్వామ్యంలో ఆయుధమైన ఓటును విలువను అవమానపరుస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సమయంలో కమ్యూనిస్టు పార్టీలు నిబద్ధత, నిక్కాచిగా ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్న  నిరుపేద వ్యక్తికి సిపిఎం టికెట్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నమ్మిన సిద్ధాంతం కోసం ఆశయం కోసం బాధ్యతలతో 32 సంవత్సరాలు పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్న జహంగీర్ను ప్రజలు ఆదరించాలన్నారు.  

కేంద్రంలోని బిజెపికి కులము, మతము, గుడి, ఆచార వ్యవహారాలు తప్ప, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి అంటే తెలవదు అన్నారు. మత మౌడయాని పెంచుతూ సైన్స్ను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రజలను వారి ఆలోచనలను   మొద్దు పరిచే విధంగా బిజెపి వ్యవహరిస్తుందన్నారు. సిపిఎం బరిలో ఉండి అనేక పోరాటాలు చేయడంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేయడానికి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం లో పోటీ చేస్తూ సిపిఎం అభ్యర్థిగా ఎండి జహంగీర్ నియమించింది అన్నారు.  

నేడు ఎన్నికలు అన్ని డబ్బులతో కూడుకున్నవి

భువనగిరి సిపిఎం పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎండి జహంగీర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర కమిటీల సూచనల తెలంగాణలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం సిపిఎం పోటీ చేయాలని నిర్ణయించుకుందన్నారు. నేడు ఎన్నికలు అన్ని డబ్బులతో కూడుకున్నవని తెలిపారు. కమ్యూనిస్టులకు డబ్బులు ఖర్చు పెట్టే శక్తి లేదన్నారు. ఆ అవసరం కూడా లేదని తెలిపారు. ప్రజలకు డబ్బులు అలవాటు చేసేది కార్పొరేట్ రాజకీయాలేనని తెలిపారు. ఆ డబ్బులను ప్రజలు తిరస్కరించే రోజులు వస్తాయని తెలిపారు. నా దగ్గర పార్టీ, దగ్గర డబ్బులు లేవని ప్రజల అండదండలే మాకు బలమని పేర్కొన్నారు. ప్రతి సమస్యపై పోరాటం చేసిన కమ్యూనిస్టులకు మాత్రమే ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుందన్నారు. ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేస్తూ రాస్తారోకో ధర్నా వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నామన్నారు ఇతర రాజకీయ పార్టీల నాయకులది వ్యక్తిగత పోరాటాలని ఎన్నికల రాజకీయ క్రీడలు ఆడుతాయని పేర్కొన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని,  బస్వాపురం ప్రాజెక్టు భూనిర్వాసితులకు నష్టపరిహారం అందించాలని ఆ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టరేట్ ముందు 72 గంటల సాగునీరు సమస్యపై కలెక్టరేట్ ముట్టడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. బస్వాపురం ప్రాజెక్టు భూనిర్వాసితులు మూసి సమస్య పిలాయి పల్లి, ధర్మారెడ్డి, బునియాది కాలువ, భీమ లింగం ఆసిఫ్ నగర కాలువల పూర్తి చేయాలని సిపిఎం కొట్లాడిందన్నారు. డబ్బులు లేకుండా ఎన్నికలలో దిగుతూ స్వచ్ఛతగా ముందుకు పోతామన్నారు. భువనగిరి పార్లమెంటు పరిధిలోని ఇబ్రహీంపట్నం పై సంపూర్ణ అవగాహన ఉందన్నారు జనగాం లోని దేవాదుల ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదు అన్నారు. మూసి కాలుష్యం వల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి పంటలను ఆహారంగా తీసుకోవద్దని శాస్త్రవేత్తలు హెచ్చరికలు చేసిన ప్రజలు గత్యంతరం లేక రసాయన కలిగిన ఆహారాన్ని తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. తమ చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం మూసి ప్రక్షాళన విషయాన్ని ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. కమ్యూనిస్టులకు ఈ ప్రాంతం వారసత్వ ప్రాంతం అన్నారు. కమ్యూనిస్టులు అనేక సమస్యల పోరాటాల ఫలితంగా వాటి ఫలాలను ఈ ప్రాంత ప్రజలు అందుకొని అనుభవిస్తున్నారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంట్లో గత అభ్యర్థులు ప్రస్తావించలేకపోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావిస్తారని తెలిపారు. మిగతా రాజకీయ ప్రక్షాలు చేసే రాజకీయ జిమ్మిక్కులకు ప్రజలు గందరగోళం పడకుండా ఎంతో చైతన్యవంతంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను సిపిఎం నుగెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దోనూరి నర్సిరెడ్డి, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, మంగ నరసింహులు పాల్గొన్నారు.