పండగను శాంతియుతంగా జరిగేలా చర్యలు

పండగను శాంతియుతంగా జరిగేలా చర్యలు

అధికారులకు మంత్రి అల్లోల సూచన

ముద్ర ప్రతినిధి, నిర్మల్: వినాయక నవరాత్రులను ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని, అధికారులు ఇందుకు తగిన చర్యలు తీసుకోవాలని శాంతి కమిటీ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. శనివారం రాత్రి నిర్మల్ కలెక్టరేట్ లో సమావేశం మందిరంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలెక్టర్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఈ నెల 18 నుండి వేడుకలు ముగిసే వరకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి ఏటా నిమజ్జనం శాంతియుతంగా జరుగుతుందని,ఈ సారి కూడా వినాయక చవితి పండుగ ఎలాంటి విఘ్నాలు లేకుండా 11 రోజులు జరిగేలా చూడాలన్నారు. కరెంటు సమస్యలు, రోడ్ల సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.