సమాజంలో శాంతికి మెడిటేషన్ కేంద్రాలు దోహదం

సమాజంలో శాంతికి మెడిటేషన్ కేంద్రాలు దోహదం

 భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: సమాజంలో శాంతి నెలకొల్పేందుకు మెడిటేషన్ సెంటర్లు ఎంతో దోహదపడతాయని భువనగిరి శాసనసభ్యుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బీబీనగర్ మండలం మహాదేవపురంలో ఆదివారం సాయంత్రం జరిగిన సైలెంట్ రీ ట్రీట్ సెంటర్ (రాజయోగ మెడిటేషన్ సెంటర్) మొదటి వార్షికోత్సవంలో పాల్గొని మాట్లాడారు. రాజకీయ నాయకులు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శాంతి నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మనిషిని సన్మార్గంలో, ఆధ్యాత్మిక పథంలో పయనింపజేయడానికి మెడిటేషన్ సెంటర్ లు సహకరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతలను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎరుకల సుధాకర్ గౌడ్, రాజయోగ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు సంతోషా దీదీ, గుడ్డి సునీత, రాజ్ దీదీ, శ్రీనివాస్ మోహన్, ఉప సర్పంచ్ దండెం అనిత ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకంటి సత్తిరెడ్డి, జిల్లా నాయకులు శ్యామ్ గౌడ్, పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు సంధిగారి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.