చేనేతను ఆదుకోవాలంటూ... మంత్రి పొన్నం ఏమంటున్నారో చూడండి

హైదరాబాద్: సాధారణంగా ప్రముఖులను ఎవరినైనా కలవడానికి వెళ్లినపుడు ఒక పూలబొకే తో వెళ్లి, శాలువా కప్పి సత్కరిస్తుంటాం.. మరి ఆ శాలువాన్నీ కూడా ఎవరూ వినియోగించుకొనేందుకు పనికి రావన్నది అందరికీ తెలిసిందే. అందుకే.. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక మంచి ఐడియాను షేర్ చేసుకున్నారు. నాతో పాటు, ఎవరు పెద్దల దగ్గరికి వెళ్లినప్పుడైనా, కాటన్ టవల్స్ ను తీసుకెళ్లండి... అవి ఎందుకైనా ఉపయోగపడతాయని అన్నారు. అలాగే  చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ, నేతన్నలకు అండగా నిలిచేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు.

దయచేసి కాటన్‌ని ప్రోత్సహించండి.. చేనేత రంగాన్ని కాపాడండి తెలంగాణ చేనేత రంగాన్ని కాపాడడానికి మీరు ఎప్పుడైనా అతిధులకు పెద్దలకు మర్యాద చేయాలనుకుంటే కాటన్ టవల్స్‌తో చేయండి.. అప్పుడు చేనేత వాళ్ళని ప్రోత్సహించినట్టు అవుతుంది. నాకే కాదు ఎవరి దగ్గరకు వెళ్ళినా మంత్రుల దగ్గరకు వెళ్ళినా కాటన్ టవల్స్ ఇవ్వండి. లేదా పిల్లలకు పనికొచ్చే పుస్తకాలు పెన్నలు ఇవ్వండిఅని మంత్రి పేర్కొన్నారు .