ఏసీబీ వలలో ఐటీడీయే అధికారులు

ఏసీబీ వలలో ఐటీడీయే అధికారులు

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఐటీడీఏలో ఏసీబీ దాడులు జరిగాయి. ఐటీడీఏ లో ఏసీబీ దాడులు ఇంజనీరింగ్‌ శాఖలో పనిచేస్తున్న డిఈ నవీన్‌, ఏ ఈ ఆబిద్‌ ఖాన్‌. 50,000 లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుపడ్డారు. గత ఏడాది ములుగు కు చెందిన సంజీవ్‌  అనే వ్యక్తి మేడారంలో పెయింటింగ్‌ వర్క్స్‌ చేశాడు. దానికి సంభందించి  16 లక్షల 50 వేల రూపాయల బిల్లు పాస్‌ చేయించడానికి ఐటీడీఏ ఇంజనీరింగ్‌ అధికారులు కాంట్రాక్టర్‌ సంజీవ వద్ద 90,000 లంచం డిమాండ్‌ చేశారు.  దీంతో పెయింటింగ్‌ కాంట్రాక్టర్‌ సంజీవ్‌ ముందుగా 50,000 ఇచ్చి పూర్తి బిల్లు పాస్‌ అయ్యాక 40 ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. తరువాత ఈ విషయమై ఏసీబీ అధికారులను ఆశ్రయించి సంజీవ్‌ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఎసిబి డిఎస్పి సుదర్శన్‌ రెడ్డి వారి సిబ్బందితో ఈనెల 10వ తారీఖు నుండి రెక్కి నిర్వహించారు. శుక్రవారం రాత్రి లంచం గా  50,000 డి ఈ నవీన్‌, ఏఈ ఆబిద్‌ ఖాన్‌ లకు ఇస్తుండగా ఎసిబి అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. ఐటీడీఏలోని ఏఈ, డీఈ చాంబర్లను సోదాలు చేసి  రికార్డులు, నగదు 50వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాలలో ఏసిబి డిఎస్పి సుదర్శన్‌ రెడ్డి తో పాటు సిబ్బంది శ్యామ్‌, కృష్ణ, శ్రీనివాసులు పాల్గొన్నారు.