నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది బిఆర్ఎస్ పార్టీనే

నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది బిఆర్ఎస్ పార్టీనే
  • మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చండూరు, ముద్ర: నల్లగొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అనిమునుగోడు ఎమ్మెల్యేకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.చండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోఆయన మాట్లాడుతూ, ఈ జిల్లాకు ఏమి అభివృద్ధి చేశారో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలనివారన్నారు.గత ప్రభుత్వంఆగం చేసిన రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంగాడిలో పెడుతున్నారనివారన్నారు. సిగ్గు శరం ఉంటే రాజకీయాలనుంచి కెసిఆర్ రిటైర్డ్ కావాలని వారన్నారు. పది సంవత్సరాలు దాటిన ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఏ మొహం పెట్టుకొని కెసిఆర్ నల్లగొండకు వస్తున్నాడో సమాధానం చెప్పాలనిఅన్నారు. ఇప్పటివరకు ఆయా ప్రాజెక్టుల కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూ నిర్వాసితులకు న్యాయం చేస్తానని గత ప్రభుత్వం హామీ ఇచ్చి, ఇప్పటివరకు పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుండి డిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడినుండి తీసుక రావాలని విషయం ఫై కెసిఆర్ కు ఇప్పటికీ క్లారిటీ లేదన్నారు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లను పిలిచిరైతులను భూ నిర్వాసితులను పేదవాళ్లను ఆగం చేసి కెసిఆర్ రిజర్వాయర్లను కట్టాడన్నారు.2014లో ముఖ్యమంత్రి హోదాలో ఎస్ ఎల్ బి సి ని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తామని చెప్పి, ఈ ప్రాంత ప్రజలను మోసం చేశారన్నారు. శివన్నగూడ రిజర్వాయర్ ను పూర్తి చేస్తామని చెప్పి ఇంతవరకు పూర్తి చేయకపోవడం గత ప్రభుత్వ నిర్లక్ష్యమని అన్నారు. కెసిఆర్ కు నైతిక విలువలు ఉంటే రాజకీయాల నుండి తప్పుకోవాలనిఅన్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డితో సహవాసం చేసి కె ఆర్ ఎం బి పై సంతకం పెట్టి కేంద్రానికి అప్పజెప్పింది కెసిఆర్ కాదా అని అయినా ప్రశ్నించారు. నల్లగొండ జిల్లాకు అన్యాయం చేయడమే కాకుండా ఇప్పుడు నల్లగొండ ప్రజలపై కపట ప్రేమ చూపించడం దొంగ నాటకమన్నారు.

నల్లగొండలో నిర్వహించే కెసిఆర్ సభను పార్టీలకతీతంగా బహిష్కరించాలనిఅన్నారు.ఈ కార్యక్రమంలోబంగారిగడ్డ ఎంపీటీసీ పల్లె వెంకన్న, ట్రస్మా జిల్లా అధ్యక్షులు కోడి శ్రీనివాసులు, మున్సిపల్ వైస్ చైర్మన్ దోటి వెంకటేష్ యాదవ్, చండూరు మాజీ సర్పంచ్ కలిమికొండ జనార్ధన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు భీమనపల్లి శేఖర్ గౌడ్, నల్లగంటి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.