యూనియన్ బ్యాంకు లో అగ్ని ప్రమాదం

యూనియన్ బ్యాంకు లో అగ్ని ప్రమాదం

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంక్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంకులో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది చుట్టూ దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఆందోళనకు గురయ్యారు. వెంటనే చేరుకున్న సిబ్బంది అగ్నిమాపక శాఖకు ఫోన్ చేశారు.

వెంటనే వచ్చిన ఫైర్ ఇంజన్ వాటర్ తో పాటు మంటలను ఆర్పే కెమికల్ ను చల్లి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తుంది. బ్యాంకులో విలువైన డాక్యుమెంట్ల దగ్ధమైనట్లు తెలుస్తుంది. దీంతోపాటు డబ్బులు, కంప్యూటర్లు ఏమైనా దగ్ధమయ్యాయోపూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.