మండలంలో మూడు చోట్ల కొనసాగనున్న సమ్మక్క సారలమ్మ జాతరలు

మండలంలో మూడు చోట్ల కొనసాగనున్న సమ్మక్క సారలమ్మ జాతరలు
  • చిన్న మేడారంలో డబ్బులు ఉంటేనే దర్శనాలు..
  • మిగతా రెండుచోట్ల ఉచిత దర్శనాలు...    

ముద్ర/రాజాపేట:- రాజపేట మండలంలో ఈనెల 21వ, తేదీ నుండి నాలుగు రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతరలు మూడు చోట్ల జరగనుండగా చిన్న మేడారంలో మాత్రం డబ్బులు చెల్లిస్తేనే దర్శనాలు ఉంటాయి. మిగతా యాదాద్రి మేడారం చల్లూరు జాతరకు, లక్ష్మక్కపల్లి మేడారం జాతరకు సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని నిర్వాహకులు తెలిపారు. చిన్న మేడారం అమ్మవార్ల దర్శనం కోసం టికెట్ల ధరలు కేటాయించి అందుకోసం నిర్వాహకులు టెండర్లను కూడా పిలిచారు. సంబంధిత అన్ని శాఖల అధికారుల సహకారంతో ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తూ చిన్న మేడారం కు వచ్చే అక్రమ సక్రమ సంపాదన నిర్వాహకులు తీసుకుంటున్నాను. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా అసలు విషయాన్ని దాటవేస్తున్నారు. చల్లూరు లక్ష్మక్కపల్లి గ్రామాల వద్ద జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వ అధికారులు సహకరించకపోయినా ఎలాంటి నిధులు కేటాయించకపోయినప్పటికీ దాతల సహకారం సొంత ఖర్చులతో భక్తులకై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండా నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. జాతర వద్ద ఇలాంటి దుకాణాలు ఏర్పాటు చేసుకున్నా డబ్బులు వసూలు చేయమని చల్లూరు, లక్ష్మక్కపల్లి నిర్వాహకులు చెప్పారు. ఉచితంగా మంచినీటి సరఫరాను ఏర్పాటు చేస్తూ భక్తులకు ఏలాంటి ఇబ్బందులకు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.