మలుపు... ప్రమాదాలకు పిలుపు
భూదాన్ పోచంపల్లి,ముద్ర:- భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రం నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రధాన రహదారిలో సబ్ స్టేషన్ వద్ద మూల మలుపు ప్రమాదకరంగా ఉంది. ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేక ఆ దారిలో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాలలో ఈ దారిగుండా ప్రయాణం చేయాలంటే మూలమలుపు వద్ద ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహన చోదకులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ దారిలో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన భూదాన్ పోచంపల్లికి దేశ విదేశీయుల సైతం ఈ దారిగుండా పట్టణానికి రాకపోకలు నిర్వహిస్తుంటారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.