ఉత్తమ్ తోనే గిరిజన తండాలు అభివృద్ధి... ఎంపిపి భూక్యా గోపాల్ 

ఉత్తమ్ తోనే గిరిజన తండాలు అభివృద్ధి... ఎంపిపి భూక్యా గోపాల్ 
  • రూ25 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 

పాలకీడు, ముద్ర:-  మండలంలోని మీగడం పహాడ్ తండ గ్రామంలో రూ.25 లక్షలతో చేపడుతున్న  సీసీ రోడ్డు పనులను ఎంపీపీ భూక్యా గోపాల్ నాయక్  సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తమ్ కుమార్ రెడ్డి తోనే గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత  తండా అభివృద్ధికి ఎన్ఆర్ఈజీఎస్ నుండి  రూ. 25 లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. గ్రామప్రజల పక్షాన మంత్రి ఉత్తమ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతి ప్రత్యేకాధికారి శ్రీనివాస్, మాజీ ఎంపిటిసిలు బెల్లంకొండ నరసింహ రావు, సైదా, లక్ష్మ, నాయకులు భూక్యా చంద్రు, రూపావత్ బాగా, దశ్రు, సైదా,రామారావు,పాండు తదితరులు పాల్గొన్నారు.