ఎమ్మెల్యే ఆదేశాలతో నూతన స్తంభాలు

ఎమ్మెల్యే ఆదేశాలతో నూతన స్తంభాలు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :భువనగిరి పట్టణం లోని శ్రీ పచ్చల కట్ట సోమేశ్వరాలయం దారిలో ప్రమాదకరంగా ఉన్న పాత విద్యుత్ స్తంభాలు, వైర్లను భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాలతో సోమవారం నూతన స్తంభాలు ఏర్పాటు చేసి మరమ్మత్తు చేశారు.  విద్యుత్ అధికారులు పనులను నిర్వహిస్తుండగా పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్ కుమార్, యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు కొల్లూరి రాజుగారు పచ్చలకట్ట సోమేశ్వరాయ మాజీ చైర్మన్ దేవరకొండ నరసింహ చారి, ఆలయ ప్రధాన అర్చకులు కప్పగంతుల నాగరాజు శర్మ, ఆలయ భక్తులు మాయ ప్రభు, రవి పనులను పర్యవేక్షించారు.