పాపం పట్టపగలే చుక్కలు చూసిన రాపిడో డ్రైవర్...పెట్రోల్ అయిపోయిన బైక్ దిగని కస్టమర్

పాపం పట్టపగలే చుక్కలు చూసిన రాపిడో డ్రైవర్...పెట్రోల్ అయిపోయిన బైక్ దిగని కస్టమర్

ముద్ర,హైదరాబాద్:- ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాడు. కస్టమర్ ను బైక్ పై ఎక్కించుకుని గమ్యస్థానానికి బయలుదేరారు. అలా వెళ్తుండగా మార్గమధ్యంలో బైక్ లో పెట్రోల్ అయిపోయింది. దీంతో బైక్ ఆగిపోయింది. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల పెట్రోల్ బంకులు లేకపోవడంతో దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకుకు బైకును తోసుకుంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యాడు బైక్ రైడర్.

కాగా బంకు వరకు నడుచుకుంటూ రావాలని కస్టమర్ ను బైక్ రైడర్ కోరాడు. నడుచుకుంటూ వచ్చేందుకు కస్టమర్ తిరస్కరించాడు. దీంతో చేసేదేం లేక అతడిని బైక్ పై కూర్చోబెట్టుకుని నెట్టుకుంటూ తీసుకు వెళ్లాడు. ఈ తతంగాన్నంతా వారి వెనకాలే వస్తున్న కారులోని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజన్లు జనాలు ఇలా కూడా ఉంటారా? బంకు వరకు కూడా నడుచుకుంటూ వెళ్లలేరా అంటూ కామెంట్ చేస్తున్నారు.