వనపర్తి అభివృద్ధి ఘనత నిరంజన్ రెడ్డిదే

వనపర్తి అభివృద్ధి ఘనత నిరంజన్ రెడ్డిదే
  • ప్రజల అభివృద్ధి కోసమే పల్లెనిద్ర..
  • పల్లెనిద్రలతో గ్రామాల్లో మెజార్టీ సమస్యలు పరిష్కారం
  • 9 ఏళ్లలో వనపర్తి నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి...
  •  పల్లెనిద్రలో పాల్గొన్న మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి 

ముద్ర, శ్రీరంగాపురం : వనపర్తి నియోజకవర్గంలో  జరిగిన అభివృద్ధి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘనతేనని సింగిరెడ్డి వాసంతి  అన్నారు. బుధవారం నాడు మండలంలోని జానంపేట గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పలు వీధుల్లో పర్యటించి ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో గత 60 ఏళ్లలో జరిగని అభివృద్ధి కేవలం 9 సంవత్సరాల లో చేసి చూపించిన ఘనత మంత్రి నిరంజన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో వనపర్తిని అభివృద్ధి విషయంలో అగ్రస్థానంలో నిలిపారని అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి పనితీరుతో జిల్లాకు నూతన మెడికల్, ఇంజనీరింగ్, వ్యవసాయ, మత్స్య కళాశాలలు వచ్చాయని ,  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తో వ్యవసాయానికి సాగునీటి విషయంలో  మరింత తోడ్పాటు అవుతుందని ఆమె వివరించారు. మంత్రి నిరంజన్ రెడ్డి కృషి వల్ల  ఎన్నడు లేని విధంగా గ్రామీణ ప్రాంత రోడ్లు, పట్టణ ప్రాంత రోడ్లు అభివృద్ధి చెందాయని అందుకు నిదర్శనం ప్రజల కండ్ల ముందే ఉందన్నారు. ప్రజల కోసం పనిచేస్తున్న మంత్రి నిరంజన్ రెడ్డి  నిరంతర శ్రమజీవిని ఆమె అన్నారు.  వనపర్తి నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో మంత్రి నిరంజన్ రెడ్డిని గెలిపించి, ఆధరించాల్సిన  బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె కోరారు. అంతకుముందు గ్రామంలో గల ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ  కార్యక్రమంలో శ్రీ రంగాపురం మండల బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.