ప్రైవేట్ స్కూల్లో దారుణం.. విద్యార్థినిపై పిఈటి టీచర్ లైంగిక వేధింపులు

ప్రైవేట్ స్కూల్లో దారుణం.. విద్యార్థినిపై పిఈటి టీచర్ లైంగిక వేధింపులు

ముద్ర ప్రతినిధి, ఇబ్రహీంపట్నం: నాదర్ గుల్ లోని ఓ ప్రైవేట్ పబ్లిక్ స్కూల్లో దారుణం చోటుచేసుకుంది. 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు గత కొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. నాదర్ గుల్ లోని ఓ ప్రైవేట్ పబ్లిక్ స్కూల్ లో 8వ తరగతి చదివే విద్యార్థినిపై నెల రోజుల నుంచి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుదు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. లైంగిక వేధింపులపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పీఈటీ వ్యవహారాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్ళినా చర్యలు తీసుకోలేదని వాపోతున్నారు. దీంతో ఆ కీచక ఉపాద్యాయుడిపై ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పాఠశాల ముందు విద్యార్థిని తల్లిదండ్రులు, బందువులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఉపాధ్యాయుడు ప్రకాష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.