మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన పటేల్ రమేష్ రెడ్డి.    

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుభాకాంక్షలు తెలిపిన పటేల్ రమేష్ రెడ్డి.    

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-ఎల్బీ స్టేడియంలో నూతన మున్సిపల్ శాఖ మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన రమేష్ రెడ్డి నల్లగొండ జిల్లా లో గతంలో తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన పదవి త్యాగం ఊరికే పోలేదని, అయితే నేడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి మళ్లీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి మంత్రి పదవి కట్టబెట్టారని, ఆయన హయాంలో అభివృద్ధి సంక్షేమం జిల్లాలో ఊపు అందుకు ఉంటుందని రమేష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.