కమ్మ వారికి రాజకీయాలలో సముచిత స్థానం కల్పించాలి 

కమ్మ వారికి రాజకీయాలలో సముచిత స్థానం కల్పించాలి 

జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకుడు చలసాని శ్రీనివాసరావు

ముద్ర ప్రతినిధి  కోదాడ:  రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించాలని జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు చలసాని  శ్రీనివాసరావు అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం ఏర్పాటు చేసిన తెలంగాణ కమ్మ రాజకీయ వేదిక సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి పది శాసనసభ సీట్లు , రెండు పార్లమెంట్ స్థానాలను ఇవ్వాలని కోరారు.  యువత విద్యార్థి దశనుండే రాజకీయాల వైపు మొగ్గుచూపులని పేర్కొన్నారు.

గ్రామపంచాయతీ స్థాయి నుండి నామినేట్ పదవుల వరకు కమ్మ సామాజిక వర్గం ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కమ్మ సామాజిక నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు అండగా నిలబడాలని అన్ని వర్గాల ప్రజలను సమీకరించి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కమ్మ సామాజిక అభివృద్ధి కోసం కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల బడ్జెట్లో కేటాయించాలని క్షేత్రస్థాయిలో కమ్మ యువ నాయకులను ప్రోత్సహించాలని తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల్లో అవకాశం కల్పించాలన్న ఏజెండాతో ముందుకు సాగాలని చలసాని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.