జీవితం జీవించడానికే

జీవితం జీవించడానికే
  • కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలి
  • అదనపు కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్.  

ముద్ర ప్రతినిధి,పెద్దపల్లి: జీవితం జీవించడానికని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని అడిషనల్ కలెక్టర్ జివి శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు.శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను అదనపు కలెక్టర్  శ్యామ్ ప్రసాద్ లాల్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామ్ మాట్లాడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తుల పట్ల సమాజం స్వాంతన చేకూర్చి మానసిక ధైర్యాన్ని నింపాలని, తనకూ ఎవరూ లేరనే అగాధాన్ని పూడ్చే ప్రయత్నంతో భరోసా నింపాలని, కష్టాల్లో ఉన్న వ్యక్తికి తనకు ఉన్న అన్నిదారులు మూసుకుపోయినప్పుడు, ఆత్మహత్య ప్రయత్నం అనే దారి తెరుచుకుంటుందని, ఆ ప్రమాదకర క్షణంలో మేమున్నామంటూ భరోసానిస్తే బయట పడతారని తెలిపారు.గత పది సంవత్సరాలుగా ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తూ ఇప్పటివరకు 18 మందిని కాపాడిన సంస్థ ప్రతినిధులను అదనపు కలెక్టర్ అభినందించారు.  ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పరికిపండ్ల అశోక్, ఆరోగ్య మిత్ర స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సహజ, సింగిల్ విండో మాజీ చైర్మన్ బూర ధనుంజయ్, తదితరులు పాల్గొన్నారు.