బాలికపై పోలీసుల అత్యాచారం

బాలికపై పోలీసుల అత్యాచారం
  • నలుగురు తమిళనాడు పోలీసుల సస్పెండ్​
  • పోక్సో కింద కేసు నమోదు, విచారణ

చెన్నై: తమిళనాడులో చట్టాన్ని రక్షించాల్సిన, ప్రజలను కాపాడాల్సిన పోలీసులే దారి తప్పారు, కీచకులుగా మారి అభం శుభం తెలియని బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. గుట్టుగా ఉన్న ఈ ఘటన మీడియాకెక్కడంతో ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. తిరుచ్చి జిల్లాలోని ఓ బాలిక తన స్నేహితుడితో కలిసి బైక్​పై వెళుతుండగా మద్యం మత్తులో ఉన్న నలుగురు పోలీసులు శశికుమార్, శంకరపాండి, ప్రసాద్, సిద్ధార్థ్​బెదిరించి గురువారం అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితుడిపై దాడి చేసి బెదిరించారు. అంతేగాక అత్యాచార ఘటనను వీడియో రికార్డు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఎవరికైనా దీని గురించి చెబితే ఇద్దరిని చంపేస్తామని హెచ్చరించినట్లుగా బాధితులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం బాధిత బాలికను ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు అత్యాచారం జరిగినట్లుగా స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు ఈ ఘటనకు కారణమైన నలుగురిని సస్పెండ్​చేసి పోక్సో చట్టం కింద అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.