పంట నష్టంపై సమీక్షించాలి

పంట నష్టంపై సమీక్షించాలి
  • సాగునీరు ఇవ్వకుండా రైతులను మోసం చేసింది కాంగ్రెస్
  • పంట పొలాలు మోడు వారడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
  • పంట నష్టం పై రైతులకు మంత్రివర్గం భరోసానివ్వాలి
  • మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్

 భూదాన్ పోచంపల్లి,ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగు నీరు ఇస్తానని చెప్పి మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాలలో ఎండిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నదిలో ఉన్న నీళ్లను సరైన పద్ధతిలో వినియోగించుకోకుండా, సరైన సమయానికి విద్యుత్తును అందించకుండా రైతాంగాన్ని ఇబ్బందులు పెడుతున్నారని  మండిపడ్డారు.బిఆర్ఎస్ హయాంలో మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు మోడు వారడానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాలు ఎండిపోతున్నా మంత్రులు కనీసం సమీక్ష చేయకపోవడం దారుణం అన్నారు. నల్లగొండ జిల్లాలో లక్షల ఎకరాలు ఎండిపోయి రైతాంగం దెబ్బతింటున్న మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకుపోవడం లేదని ప్రశ్నించారు. పంట నష్టం పై మంత్రివర్గం సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ కొలువులపల్లి అమరేందర్ ,ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు పాటీ సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కందాడి భూపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ రావుల శేఖర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ముత్యాల మహిపాల్ రెడ్డి, పగిళ్ల సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచులు పగిళ్ల స్వప్న రామ్ రెడ్డి, పీసర్ల మంజుల మహిపాల్ రెడ్డి, నాయకులు చిల్లర జంగయ్య, గునిగంటి మల్లేష్ గౌడ్, చేరాల నరసింహ, చింతకింది కిరణ్, నోముల ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.