ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు...

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు...

బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయ‌న ఎన్నిక‌ను ర‌ద్దు చేయాలంటూ విజ‌యా రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై జ‌స్టిస్ విజ‌య్‌సేన్ రెడ్డి విచార‌ణ చేప‌ట్టారు. పిటిష‌న‌ర్ త‌ర‌పున సుంక‌ర న‌రేశ్ వాద‌న‌లు వినిపించారు. ఎన్నిక‌ల్లో ఓట‌ర్ల‌ను దానం నాగేంద‌ర్ ప్ర‌లోభ‌పెట్టార‌ని కోర్టుకు ఆయ‌న తెలిపారు. డ‌బ్బులు పంచ‌డంతో పోలీసు స్టేష‌న్లలో కేసులు న‌మోదు అయ్యాయ‌ని చెప్పారు. ఆయ‌న స‌తీమ‌ణి పేరు మీద ఉన్న ఆస్తుల వివ‌రాల‌ను నామినేష‌న్ ప‌త్రాల్లో పేర్కొన‌లేద‌న్నారు. దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ దానం నాగేంద‌ర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను వ‌చ్చే నెల 18కి వాయిదా వేసింది.