ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో సైఫ్ అరెస్ట్ 

ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో సైఫ్ అరెస్ట్ 

ముద్ర ప్రతినిధి, వరంగల్: వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ క‌ళాశాల పీజీ వైద్య విద్యార్థిని ద‌రావ‌త్ ప్రీతి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం ఘ‌ట‌న‌లో నిందితుడు సైఫ్‌ను శుక్ర‌వారం ఉద‌యం పోలీసులు అరెస్టు చేశారు. ప్ర‌ీతిని వేధింపుల‌కు గురిచేయ‌డంతో ఆమె బుధ‌వారం ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమె హైద‌రాబాద్‌లోని నిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతోంది. అయితే ఆమె ఆరోగ్యం అత్యంత విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న వ‌రంగ‌ల్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. ఇప్ప‌టికే కేఎంసీ వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్నారు.