‘సర్వశిక్షా అభియాన్’  ముట్టడి ఉద్రిక్తం

‘సర్వశిక్షా అభియాన్’  ముట్టడి ఉద్రిక్తం
  • సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్ట్​ఉద్యోగుల ఆందోళన
  • లక్డీకాపూల్​లోని విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడి
  • అడ్డుకున్న పోలీసులు.. ఆర్.కృష్ణయ్య అరెస్ట్​

ముద్ర, తెలంగాణ బ్యూరో : నగరంలోని లక్డీకాపూల్​వద్ద బుధవారం నిర్వహించిన సర్వశిక్షా అభియాన్​కాంట్రాక్ట్​ఉద్యోగుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, మినిమం టైమ్ స్కేల్​అమలు చేస్తూ హెల్త్​ఇన్సూరెన్స్​ఇవ్వాలని డిమాండ్​చేస్తూ లక్డీకాపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్​కార్యాలయాన్ని ఉద్యోగులు ముట్టడించారు. వివిధ జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యాలయం వద్దకు చేరుకున్న ఉద్యోగులను అడ్డుకొని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. వారికి మద్దతుగా వచ్చిన రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.​కృష్ణయ్య, పీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్​ను అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఉద్యోగులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీసు స్టేషన్​కు తరలించారు. దీంతో లక్డీకాపూల్​పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్​ జామ్​అయ్యింది.