ఎమ్మార్పీ ధరలకే విత్తనాలను ఎరువలను విక్రయించాలి... ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

ఎమ్మార్పీ ధరలకే విత్తనాలను ఎరువలను విక్రయించాలి... ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.

మోత్కూర్, ముద్ర: మోత్కూర్ వ్యవసాయ శాఖ పరిధిలో యాదాద్రి భువనగిరి ఇంటర్నల్ డిస్టిక్ స్క్వాడ్ టీం పద్మావతి, వ్యవసాయ సహాయ సంచాలకులు యాదగిరిగుట్ట,తుర్కపల్లి ,బొమ్మలరామారం మండల వ్యవసాయ అధికారులు దుర్గేశ్వరి, పద్మ ,పోలీస్ అధికారి మండల పరిధిలోని ఎరువుల పురుగులు, విత్తనాల దుకాణాలను స్థానిక మండల వ్యవసాయ అధికారి స్వప్నతో కలిసి తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా శ్రీ రామలింగేశ్వర, గ్రోమోర్ సెంటర్ శ్రీరామ దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో భాగంగా విత్తనరసీదులను ఇన్వాయిస్లను ,స్టాక్ రిజిస్టర్ లను ,డెలివరీ చలానా పొందిన సోర్స్ సర్టిఫికెట్లను ,స్టాక్ బోర్డ్ పైన విత్తన రకాల,ఎమ్మార్పీలను పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా డీలర్లు తప్పనిసరిగా రైతులకు రసీదు అందజేసి సంతకం తీసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది.

ఈ రసీదులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరచవలసిందిగా రైతులకు సూచించడం జరిగింది. అంతేకాకుండా రోజువారి రైతుల  రిజిస్టర్ లను పరిశీలించడం జరిగింది మరియు కంపెనీ నుండి విత్తనములను పొందిన వెంటనే  ఇన్ వాయిస్ లో లాట్ నెంబర్లు , ప్యాకెట్ల పై లాట్ నెంబర్లను సరిచూసుకోవాల్సిందిగా మరియు విత్తన బ్యాగుల మీద లేబుల్ లను సరిచూసుకొని రైతులకు విక్రయించాల్సిందిగా హెచ్చరించారు. నాణ్యమైన విత్తనములను మాత్రమే రైతులకు అమ్మవలసిందిగా,ఎమ్మార్పీలకు మాత్రమే విక్రయించాల్సింది గా లేనిచో చట్టారీత్యా కఠినమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దుకాణ యాజమానులు రైతులు పాల్గొన్నారు.